బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

అంకాపూర్‌కు వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులను గృహ నిర్బంధం…. మండలంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు…

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

విజయభారతి :ఆర్మూర్ న్యూస్ జూలై 21

ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్‌లో ఈ నెల 17న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి నిరసనతెలిపేందుకు అంకాపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను ఆర్మూర్ పోలీసులు గృహనిర్బంధం చేశారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనిఆరోపించారు.పేదలకు రూపాయికే వైద్యం, ప్రతి గ్రామానికి పది ఉచిత ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయాల్లో పరస్పర గౌరవాన్ని పాటించాలని సూచించారు.ఎమ్మెల్యేను కలిసితననిరసననుతెలియజేయడానికి వెళ్తుండగా పోలీసులు గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య హక్కులనుకాలరాయడమేనని వినయ్ కుమార్ రెడ్డివిమర్శించారు.ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ చర్యను ఖండిస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.