Breaking News

అక్రమ నిర్మాణాలు నిర్మించడంలో షాన్వాస్ కి పెట్టింది పేరు

అక్రమ అంతస్తులు కట్టు అడుగుతే ఓట్టు

-ఇష్టారాజ్యంగా అక్రమ అంతస్తుల నిర్మాణాలు

-కూల్చివేస్తున్న తిరిగి నిర్మాణాలు

-మామూళ్ల కు పరిమితమైన టౌన్ ప్లానింగ్ విభాగం

-సమస్యలను పట్టించుకోవడం లో ఉన్నతాధికారులు విఫలం…

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; అక్రమ నిర్మాణాలు నిర్మించడంలో షాన్వాస్ కి పెట్టింది పేరు ఆయనో కమర్షియల్ బిల్డర్ కమర్షియల్ ఏరియాల్లో అక్రమ నిర్మాణాలు చేయడం అతనికి హాబీ పర్మిషన్లు లేకుండానే కన్స్ట్రక్షన్స్ చేయడం అతని నైజం కమర్షియల్ ఏరియాల్లోనే నిబంధనలను ఉల్లంఘించి యదేచ్ఛగా కాంప్లెక్సుల నిర్మాణాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అధికారులకు అమ్యమ్యాలు ఇవ్వడం అందర్నీ మానేజ్ చేయడం
అతని నైజం శేరిలింగంపల్లి సర్కిల్లో అక్రమ కట్టడాల సామ్రాజ్యం…టౌన్ ప్లానింగ్
అధికారులతో కుమ్మకై
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కమర్షియల్ కింగ్ మేకర్ షాన్వాస్.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ…

ప్రభుత్వం ఏర్పాటుతోనే అవినీతి పై ఉక్కుపాదం మోపుతామన్న ముఖ్యమంత్రి ఆదేశాలను కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు.అందుకు నిదర్శనం శేరిలింగంపల్లి నియోజకవర్గం సర్కిల్ 20 లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల భాగోతమే ముఖ్యంగా శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.కొన్ని చోట్ల 150 నుండి 250 గజాల లోపు ఉన్న స్థలంలో ఐదు అంతస్తుల నుండి ఏడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎవరు పడితే వారు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే వారి దెగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు పట్టణ ప్రణాళిక విభాగం పై గుప్పు మంటున్నాయి. దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కాస్త అధికారుల జేబుల్లోకి వెళుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలో కొండాపూర్ ప్రభుపాద, మసిద్ బండ, రాఘవేంద్ర కాలనీ రాజరాజేశ్వరి కాలనీ, శ్రీరామ్ నగర్ A B C కాలనీ, గచ్చిబౌలి, డి ఎల్ ఎఫ్, కాజాగుడా, శేరిలింగంపల్లి బీహెచ్ఈఎల్ హెచ్ఐజి, సుదర్శన్ నగర్, నాలగండ్ల, గోపన్ పల్లి, గౌలి దొడ్డి, టెలికాం నగర్, ఎన్ జి ఓ కాలనీలలో అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. అలాగే గ్రౌండ్ ప్లస్ 2 పర్మిషన్ తీసుకుని అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు ఏం చేస్తున్నారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లి సర్కిల్ లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టిన తిరిగి మళ్ళీ కిందిస్థాయి అధికారుల ప్రోద్బలంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు వెనక టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్, చైన్ మెన్ లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిగా అవినీతి మయమైన టౌన్ ప్లానింగ్

పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్ మెన్ నుండి పై స్థాయి అధికారి వరకు జీహెచ్ఎంసీలో మామూళ్లకు అలవాటు పడడం వల్లనే ప్రతి వీధిలో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి అన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెల అధికారులకు జీతాల కంటే అక్రమ నిర్మాణాలపై వస్తున్న మామూళ్లే లక్షలు దాటి కోట్లలో వెనకస్తున్నారనే విమర్శలు సర్కిల్ చుట్టు చక్కర్లు కొడుతున్నాయి.ఈ లెక్కన అధికారుల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు మౌనం వహించడంతో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా అవినీతి రాజ్యమేలుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఫలితం ఉండదని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు అక్రమ నిర్మాణాల పైన టౌన్ ప్లానింగ్ అధికారులు పైన చర్యలు తీసుకోవాలని చెప్పిన ఎలాంటి చర్యలు తీసుకోని దుస్థితి నెలకొందని ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాలని అవసరం ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఉప కమిషనర్ లు స్పందించి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సర్కిళ్ల నీ.. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై అందుకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే జిహెచ్ఎంసి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆధారాలతో నిరూపిస్తాం…
శేరిలింగపల్లి సర్కిల్‌ 20, జీ.హెచ్‌.ఎం.సీ పరిధిలో చెలరేగుతున్న అక్రమ నిర్మాణదారులు..
ప్రేక్షక పాత్రలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు..
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు..
యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు.. టి పి ఓ, చైన్ మెన్ల లీలలపై ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రిక లో మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *