Breaking News

తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!

విజయభారతి :హైదరాబాద్:జులై 04

తెలంగాణలో నిరు ద్యోగ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలిపింది, రాష్ట్ర పోలీసు శాఖ లో వివిధ కేటగిరీల లో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారి కంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను సమీక్షించిన అనంతరం శాఖ అవసరాలు, సిబ్బంది కొరత, ఆర్థిక భారం వంటి అంశాలను పరిశీలిం చి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ద్వారా నిర్వహించా లని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ నియామక ప్రక్రియను వేగవం తంగా పూర్తి చేయా లని ప్రభుత్వం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని ఆదేశించింది. స్థానిక కేడర్‌ల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హ తలు, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను హోం శాఖ, డీజీపీ కార్యాలయం రిక్రూట్‌మెంట్ బోర్డుకు వెంటనే అందజేయాలని సూచించింది. అన్ని వివరాలు అందిన వెంటనే టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ అధికారిక నోటిఫికేషన్ విడు దల చేసి.. నియా మక షెడ్యూల్‌ను ప్రకటించనుంది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్య ర్థులకు త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం లభించ నుంది.ఈ భారీ నియామక ప్రక్రియ తో తెలంగాణ పోలీసు శాఖలో సిబ్బంది కొరత కొంత మేర తీరనుం డగా..రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం తీసు కున్న ఈ నిర్ణయం పోలీసు నియామ కాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభ్యర్థు ల్లో కొత్త ఆశలను నింపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలు గో నోటిఫికేషన్‌. 2015 చివరలో 9281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కాగా..2018లో 1217 మంది ఎస్సై పోస్టులు, 16285 మంది కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. 2022లో 554 ఎస్సై పోస్టులతో పాటు 15644 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది. తాజాగా మరో 5 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.


సబ్‌-ఇన్‌స్పెక్టర్ (సివిల్) – 148 పోస్టులు
సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఏఆర్– 14 పోస్టులు
రిజర్వ్ సబ్‌- ఇన్‌స్పెక్టర్ టీజీఎస్‌పీ– 12 పోస్టులు
సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఏఆర్ సీపీఎల్ – 5 పోస్టులు
అసిస్టెంట్ సబ్‌-ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) – 3 పోస్టులుపోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ – 1,052 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ ఎస్‌ఏఆర్ సీపీఎల్, – 24 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) – 20 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) – 25 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఆర్మూర్ అభివృద్ధికి భారీ నిధులు.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.42 కోట్ల రోడ్ల నిర్మాణాలకు ఆమోదం…. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *