
విజయభారతి ఆర్మూర్, న్యూస్ , జులై 19 :-
ఆర్మూర్ పట్టణంలోని పట్టు చేనేత సహకార సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సహస్రార్జున కమిటీ తరఫున ఘనంగా సన్మానించారు. పట్టణ కేంద్రంలోని రామ్ నగర్ లో గల శ్రీరామాలయంలో ఆదివారం సహస్రార్జున కమిటీ అధ్యక్షులు బోచ్కర్ పిఎఫ్ దత్తాద్రి, కార్యదర్శి దొండి కొబ్బని శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పట్టు చేనేత సహకార సంఘం అధ్యక్షులు గంగా మోహన్ చక్రు, ఉపాధ్యక్షులు షికారి శ్రీనివాస్, కార్యదర్శి బోచ్కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి బదాం రాజ్ కుమార్ లకు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టు చేనేత సహకార సంఘం అధ్యక్షులు గంగామోహన్ చక్రు మాట్లాడుతూ పట్కరీ క్షత్రియ సమాజ్ మరియు పట్టు చేనేత సహకార సంఘ సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వ మరియు దాతల సహకారంతో నూతన బిల్డింగ్ నిర్మాణం చేస్తామని, ఓట్లు తొలగిపోయిన సభ్యులను కూడా మల్లీ సంఘంలో చేర్చుటకు ప్రయత్నం చేస్తామని అన్నారు. సమాజ సభ్యులందరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 16 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దొండి ఈశ్వర్, డీకే శ్రీహరి, డమాంకర్ రవీందర్, నగరి వినోద్, బారడ్ ప్రవీణ్, గట్టడి సత్యనారాయణ, కర్తన్ విజయ్ పాల్, పోహార్ విటోబా శేఖర్, దోండి వినోద్, హజారి ఈశ్వర్, వైద్య గణేష్, జికే విజయేంద్ర, నీరజ్, బచ్చేవాల్ రవి, గట్టడి బాబు, మామిడి లక్ష్మీనారాయణ, బారడ్ అర్వింద్, కార్తీక్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
