Breaking News

పదవుల కోసం గాంధీ భవన్ కు రావద్దు: సీఎం రేవంత్ రెడ్డి…! ప్రజల్లో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత…

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

విజయభారతి హైదరాబాద్: న్యూస్ 19: రిపోర్టర్ సుంకరి: గంగా మోహన్

తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కు సం బంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నంత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది..ఆదివారం టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్, నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ బేటిలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు.సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లా డుతూ.. ఛైర్మన్ పద వులు, పార్టీ పోస్టులు కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, ఇకపై పనితీరు ఆధా రంగానే గుర్తింపు ఉం టుందని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.నాయకత్వం అంటే హైదరాబాద్‌లోని ఏసీ గదుల్లో కూర్చో వడం కాదు, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయడమన్నారుపదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని కరాఖం డిగా చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థా యి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలని అన్నారు.రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులెవ్వరూ గాంధీభవన్‌కు రావొద్దంటూ తెలిపా రు.కొందరు నాయకు లు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయ డం లేదు. సోమవా రం పది మంది ఇన్‌ ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పు డు సమీక్షలు జరపా లి. ఇన్‌ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయక పోతే కఠినంగా వ్యవహరిస్తాం. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాం. అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుం టామన్నారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లను సమ న్వయం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎస్‌ఐ ఆర్‌పై సీరియస్‌గా దృష్టి సారించాలి అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *