Breaking News

ఇందూర్ రణభేరి సెగతో వణికిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు….. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి’ కాంగ్రెస్ నాయకుల డ్రామా..!

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

విజయభారతి : నిజామాబాద్ న్యూస్ జూలై 21

జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారిబహిరంగ చర్చకు రమ్మంటే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇందూర్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖంచాటేసిపారిపోయారు. అభివృద్ధిపై చర్చించడానికి వస్తుంటే బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులతో జిల్లా వ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎంపీ శ్రీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ‘ఇందూర్ రణభేరి’ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి వచ్చిన విశేష స్పందనను కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి డ్రామాలకు తెరతీశారు.ఇందూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ (సీపీ) తో ఫోన్లో మాట్లాడుతు ఈ బహిరంగ చర్చ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా ఎమ్మెల్యే కి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది, ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా జరిగిన బీజేపీ కార్యకర్తల అరెస్టులను ఎంపీ గారు తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి ఫోన్ చేసిన ఎంపీ అరవింద్ సంపూర్ణ మద్దతునుతెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఇంటికి వస్తామని, ప్రశ్నిస్తామని ప్రగల్భాలు పలికారు. వారు వస్తే స్వాగతిస్తామని జిల్లా పార్టీ తరపున, ఎమ్మెల్యే గారి తరపున మేము స్పష్టంగా చెప్పాము. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ తన 30 నెలల పాలనలో అసెంబ్లీలో మరియు వివిధ ప్రజావేదికల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 700 కోట్ల నిధులు, 3000 ఇండ్లు మంజూరు చేయించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ఎంపీ అరవింద్ ధర్మపురి నాయకత్వంలో ఆర్మూర్‌కు ‘అమృత్’ పథకాన్ని తీసుకురావడం జరిగిందిఅంకాపూర్ చికెన్ పెట్టి అభివృద్ధి మీద చర్చిద్దాం రమ్మంటే మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు రాలేదు? సవాలు విసిరింది కాంగ్రెస్ నాయకులు అయితే.. దొంగచాటుగా బిజెపి కార్యకర్తలను అరెస్టు చేయించారు. జిల్లా కలెక్టరేట్‌లో సాగునీరుకు సంబంధించి కీలక సమావేశం ఉంటే, ఆ సమావేశానికి వెళ్లకుండా ఎమ్మెల్యేలు శ్రీ రాకేష్ రెడ్డి ని, శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేయడం ప్రభుత్వనియంతృత్వానికి నిదర్శనం.ఎంపీ శ్రీ అర్వింద్ ధర్మపురి నాయకత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, ఇందూర్ జిల్లా ప్రజల సమస్యల కోసం, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా బీజేపీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *