నిద్రమత్తులో జోగుతున్న ఉన్నతాధికారులు
మామూళ్ల కు పరిమితమైన టౌన్ ప్లానింగ్ విభాగం
బేరం కుదుర్చుకొని అక్రమార్కుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కిందిస్థాయి సిబ్బంది
మియాపూర్ మదినాగుడా విజయ భారతి న్యూస్ ;
ఎట్టి పరిస్థిథుల్లొను అక్రమ నిర్మాణాలను ఉపెక్షించమని చెప్పే అధికారులు అంధిన కాడికి పుచ్చుకుని ఏమి ఎరుగనట్లు చోద్యo చూస్తున్నారు. మదీనాగుడా డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్ రోడ్ సర్వే నంబర్ 23 పార్కు స్థలాన్ని కొంతమంది భూ బకాసురులు సర్వే నంబర్ 5,6,7,8, గా మార్చి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణం వెంటనే నిలిపివేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. మదినాగుడా డివిజన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పై ప్రజల నుండి పిర్యాదులు అంధుథున్నా చూస్తాం చర్యలు తీసుకుంటామని చెప్తూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులో ఉండి కాలయాపన చేస్తున్నారు. చైన్ మెయిన్ ల ద్వార, మధ్యవర్తుల ద్వార వ్యవహారం చక్కబెట్టుకుంటున్నారు. వారికి చైన్ మెన్ లు అన్ని తామై వ్యవహారిస్థున్నారు. మియపూర్ సర్కిల్ పరిధి లొ టౌన్ ప్లానింగ్ అధికారులపై , చైన్ మేన్ ల పై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ చైన్ మెన్ లను అటు ఇటు మార్చినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.
నిబంధనలకు నీళ్లు…
మదినాగుడా డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పార్కు స్థలాన్ని కొంతమంది భూ బకాసురులు సర్వేనెంబర్ 23ను కాస్త సర్వే నంబర్ 5,6,7,8 గా మార్చి
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేస్తున్నారు. దీని పై వెంటనె జి హెచ్ యం సి అధికారులు కాలయాపన చేయకుండా కబ్జాలకు పాల్పడ్డ వారిపై వెంటనే కటిన చర్యలు తీసుకోని పార్కు స్థలాన్ని కాపాడాలని అక్కడి గ్రామస్థులు కోరుతున్నారు.
అన్ని ఆధారాలతో నిరూపిస్తాం మియాపూర్ సర్కిల్ జిహెచ్ఎంసి పరిధిలో చెలరేగుతున్న పార్కుల కబ్జా అక్రమ నిర్మాణాదారులు.. ప్రేక్షక పాత్రలో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వా నిబంధనలకు తెలిదాకాలు యదేచ్చగా పార్కుల కబ్జాలపై ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రికలు మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.

