శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్ఆర్పీఎస్)ఎమ్ఎస్పీ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఎమ్ఆర్పీఎస్, ఎమ్ఎస్పీ మండల అధ్యక్షులుగా జగపతి అంజయ్య, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ రావుగళ్ళ బాబు మాదిగ ప్రకటించారు ,నూతన కార్యవర్గం ఎమ్ఆర్పీఎస్ ఎమ్ఎస్పీ రాజ్యాధికార సూచన మేరకు, అధికార ప్రతినిధిగా సాంసంగ్ మాదిగ, ఎమ్ఎస్పీ మండల అధ్యక్షులుగా సుదర్శన్ మాదిగ,
ఎమ్ఎస్పీ అధికార ప్రతినిధిగా సింగారం దాసరి రాజు మాదిగ నియామకాలు జరిగాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మందా కృష్ణ మాదిగ ఆశీస్సులతో, రాజ్యాధికార సూచన మేరకు ఎమ్ఆర్పీఎస్ /ఎమ్ఎస్పీ శేరిలింగంపల్లి మండల కార్యక్రమాలను బలోపేతం చేస్తామని, మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐత రమేష్ మాదిగ, సింగ దాసరి,నరేష్ మాదిగ, రాజేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
