బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

పెర్కిట్ బైపాస్ వద్ద మిర్చి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా…. పెర్కిట్ (కోటార్మూర్) బైపాస్‌లో గుంతలే కారణం…. ఖమ్మం నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ప్రమాదం… డ్రైవర్‌కు తృటిలో తప్పిన ముప్పు…. బైపాస్ మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల డిమాండ్….

(విజయభారతి) ఆర్మూర్ న్యూస్; ఆగస్టు: 06

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ (కోటార్మూర్) బైపాస్‌లో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి మధ్యప్రదేశ్‌కు మిర్చి లోడుతో వెళ్తున్న లారీ నిర్మల్ వైపు ప్రయాణిస్తుండగా, బైపాస్‌పై ఉన్న భారీ గుంతల్లో చక్రాలు ఇరుక్కోవడంతో అదుపు తప్పి ఒకవైపుకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ ఒకవైపుకు తీవ్రంగా దెబ్బతినగా, డ్రైవర్ మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.స్థానికులు, లారీ డ్రైవర్ల కథనం ప్రకారం, పెర్కిట్ బైపాస్ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా భారీ గుంతలతో అధ్వాన్నంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించేందుకు భారీ వాహనాల డ్రైవర్లు భయపడుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం రహదారి నిర్మాణం కోర్టు కేసులో ఉందని, కేసు పరిష్కారమైన తర్వాతే పనులు చేపడతామని చెబుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
అయితే, రోడ్డు దుస్థితి కారణంగా తరచూ ప్రమాదాలుజరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బైపాస్ రహదారిని తక్షణమే మరమ్మతులు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు, లారీ డ్రైవర్లు కోరుతున్నారు.