బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

చలో అంకాపూర్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి… ప్రజా సమస్యలపై పోరాటానికి ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ | జూలై 19

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న “చలో అంకాపూర్” కార్యక్రమంపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పందించారు. ప్రజా సమస్యలతో ఎవరైనా ముందుకు వస్తే వాటిపై చర్చించేందుకు, ప్రజల తరఫున పోరాడేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఆర్మూర్ ఆడపడుచులకు హామీ ఇచ్చిన తులం బంగారం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అలాగే పెంచిన పెన్షన్లను నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తగిన సహకారం అందించడం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు.తాను బీజేపీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నానని పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన చలో అంకాపూర్ కార్యక్రమం తనకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని, నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో మరింత బలంగా ప్రస్తావించే అవకాశం కల్పించిందని అన్నారు.
ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐక్యంగా నిలిచి సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.