బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

టెస్కో డైరెక్టర్ రేసులో ఆర్మూర్ చేనేత సంఘం చైర్మన్ చెన్న రవికుమార్ ముందంజ….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 18

తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (టెస్కో) ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డైరెక్టర్ పదవికి ఆర్మూర్ చేనేత సహకార సంఘం చైర్మన్ చెన్న రవికుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. చేనేత రంగంలో చేసిన సేవలు, సహకార సంఘాల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన డైరెక్టర్ రేసులో ముందువరుసలో ఉన్నారని చేనేత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, పిట్లం, దోమకొండ, బీబీపేట్, కామారెడ్డి చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ప్రతినిధుల ద్వారా జిల్లా డైరెక్టర్ ఎంపిక జరగనుంది.టెస్కో రాష్ట్ర స్థాయి పాలకవర్గంలో గత ఉమ్మడి జిల్లాల వారీగా 10 మంది డైరెక్టర్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉన్ని సహకార సంఘం తరఫున మరో డైరెక్టర్‌ను కలుపుకుని మొత్తం 11 మంది డైరెక్టర్లు ఎన్నిక కానున్నారు. అనంతరం వీరిలో ఒకరిని పరోక్ష పద్ధతిలో టెస్కో చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.ఈ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి చెన్న రవికుమార్ అభ్యర్థిత్వం ప్రాధాన్యత సంతరించుకోవడంతో చేనేత వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం రాజకీయ, సహకార సంఘాల సమీకరణలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…