Breaking News

రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో బిజెపి ఎమ్మెల్యే నిధులు ఎవరు మంజూరు చేయాలి….

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో బిజెపి ఎవరు నిధులు తేవాలి….

వినయ్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు..

అడుగఅడుగున పోలీసుల తనిఖీలు..

ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకుల అరెస్ట్..

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

విజయభారతి ఆర్మూర్, న్యూస్ జూలై 21

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరీ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చలో అంకాపూర్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం ఇంటి వద్ద ఉండి చర్చకు సిద్ధమని పేర్కొనడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారే అవకాశాలు ఉన్నందున పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడగడుగున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నందున పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వినయ్ రెడ్డి బయటకు వెళ్లకుండా పోలీస్ అధికారులు ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. అంకాపూర్ కు వెళ్తే కాంగ్రెస్, బిజెపి నాయకులు ఘర్షణ పడే అవకాశాలు ఉన్నాయని శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించి పోలీసులు వందలాది మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా, ఆలూర్ బైపాస్ రోడ్డు, అంకాపూర్ తో పాటు వినయ్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అంకాపూర్ కు వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత. అంకాపూర్ లోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తో పాటు వందలాదిమంది బిజెపి నాయకులు కర్రలు చేతులు పట్టుకొని ముట్టడి చేయడానికి వస్తే ఎదుర్కొంటామని సన్నద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అభివృద్ధి విషయమై చర్చకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీస్ అధికారులు అడ్డుకొని వారించారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు సంయమనం పాటించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, భీంగల్ సీఐసత్యనారాయణ, రూరల్ సీఐ జాన్ రెడ్డి, జిల్లాలోని పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించి ఏలాంటి అలజడులు జరగకుండా పరిస్థితిని సమీక్షించారు. అంకాపూర్ లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి యత్నించినఅయిదారుగురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే ఇంటిని కాంగ్రెస్ నాయకులుముట్టడించడానికి వచ్చే అవకాశాలు ఉన్నందున అడగడుగునా పోలీసులు నిఘా ఉంచారు. కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు ప్రముఖులను అదుపులోకి తీసుకొని ఇతర స్టేషనులకు తరలించడంతో అంకాపూర్ కు కాంగ్రెస్ నాయకులు రాకుండా పోలీసులు నివారించగలిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *