బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆర్మూర్‌లో కాంగ్రెస్–బీజేపీ మధ్య హైటెన్షన్…! అభివృద్ధిలో ఆర్మూర్ ను ముందుకు తీసుకెళ్లాలి…

ఆర్మూర్‌లో కాంగ్రెస్–బీజేపీ మధ్య హైటెన్షన్…!

అభివృద్ధిలో ఆర్మూర్ ను ముందుకు తీసుకెళ్లాలి…

అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి…

కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవుల కోసం పనిచేసేవారు…

ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధిలో ముందుకు రావాలి…

ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ టికెట్ రాదని భయం పుట్టుకొచ్చింది…

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడ ఉనికి తగ్గుతుందో అని ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి….

అంకాపూర్‌లో 144 సెక్షన్ అమలు

విజయభారతి ఆర్మూర్, న్యూస్ జూలై 21

ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసాన్నిముట్టడిస్తామని ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రూ.1కే వైద్యం, ప్రతి గ్రామంలో పేదలకు 10 ఇళ్ల నిర్మాణం, ఆర్మూర్‌కు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, వాటిని అమలుచేయకపోవడంతో నిరసనచేపడుతున్నామని తెలిపారు.దీనిపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పందిస్తూ విడుదల చేసిన వీడియోలో, తన ఇంటిని ముట్టడించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని వ్యాఖ్యానించారు. తనఇంటినిముట్టడించాలంటే ముఖ్యమంత్రి లేదా మంత్రుల స్థాయి నాయకులు రావాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తూ వారి ఆస్తులు, వాహనాలపై కూడా వ్యాఖ్యలు చేశారు.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసు కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఐదుగురికిమించిగుమికూడకుండా పోలీసులు చర్యలుతీసుకుంటుండగా, నిబంధనలు ఉల్లంఘించే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తంగావ్యవహరిస్తున్నారు.