

(విజయభారతి): హైదరాబాద్ న్యూస్ జులై 30 రిపోర్టర్ సుంకరి గంగామోహన్
డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా – ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిపోర్టర్ సుంకర గంగా మోహన్
హైదరాబాద్: డొంకేశ్వర్ మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పెద్దలు, గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హైదరాబాద్‌లోని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న అభివృద్ధి సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత, ప్రజల అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.గ్రామస్తుల వినతులను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, డొంకేశ్వర్ మండలానికి సంబంధించిన సమస్యలను రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
ఎమ్మెల్యే స్పందనకు సంతోషం వ్యక్తం చేసిన డొంకేశ్వర్ మండల ప్రజలు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
