విజయభారతి న్యూస్: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తల్లి , చర్లపల్లి కార్పొరేటర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ అత్తమ్మ బొంతు కమలమ్మ దశదిన కర్మ కార్యక్రమం చర్లపల్లి డివిజన్ శ్రీ కృష్ణ కన్వేషన్ హల్ లో జరిగింది . ఈ కార్యక్రమంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య, బి.సి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, అందేలా కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేరి రామచందర్ యాదవ్ గారు కీర్తిశేషులు బొంతు కమలమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆమెకు ఘన నివాళులు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొంతు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున బీసీ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు బొంతు కమలమ్మకు శ్రద్ధాంజలి తెలిపారు.
