విజయభారతి న్యూస్ ; ఏకభుక్త భోజనం, ఉపవాసం, బ్రహ్మాగడియాల్లో స్నానం పూజక్రతువు నిర్వహించడం అంతా ప్రకృతి నియమాలను పాటించటమేనని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
బడంగ్ పేట కార్పొరేషన్ నాదర్ గుల్ గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ, ఇరుముడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా KLR మాట్లాడుతూ. 41 దినాలకు పైగా ఎంతో నిష్టతో ఉండటం వల్ల గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మంచి ఆరోగ్యం సమాజానికి ఇస్తున్నారని కొనియాడారు. నిత్య జీవితంలోనూ మంచి అలవాట్లను కొనసాగిస్తే పేరు, ప్రఖ్యాతి, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని గుర్తు చేశారు. నేడు ప్రజలకు డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని కిచ్చెన్నగారు సూచించారు.
పూజక్రతువుకు హాజరైన లక్ష్మారెడ్డికి గురుస్వామి అశోక్ సహా ఇతర స్వాములు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులు తీసుకుని.. క్షేమంగా వెళ్ళి రావాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, యెల్మేటి అమరేందర్ రెడ్డి, బంగారు బాబు, శంకర్ గురుస్వామి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అశోక్, ఆనందరెడ్డి, సుభాన్ యాదవ్, వెంకటేష్ యాదవ్, నవారు మల్లారెడ్డి, మర్రి లింగారెడ్డి, వెంకటేష్ గౌడ్, నర్సింహా చారి సహా జి. హనుమంతరావు గురుస్వామి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


