* కొండాపూర్ ప్రభుపాద కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు*

శేరిలింగపల్లి ఎస్ ఎస్ న్యూస్ ; దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి ఓవైపు ఐటెక్ సిటీ మరో వైపు ఫైనాన్షియల్ డిస్టిక్ సాఫ్ట్ వెర్ రంగాలలో దూసుకు పోతున్న క్రేజ్ ఉంది. అలాంటి నగరం బౌగోలికంగా విలాసవంతమైన, సుఖవనంతమైన జీవితం గడపడానికి ప్రజలు ఇష్టపడతారు. దానికి తోడు సాఫ్ట్ వేర్, విద్యాలయాలు, ఆసుపత్రులు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్ ఇలా ఎన్నో సంస్థలు ఇక్కడ స్థిరపడ్డాయి. దాంతో నివాస గృహలకు ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి జోన్ పరిధిలో హాస్టల్స్, హోటళ్ళు, సాఫ్ట్ వేర్ సంస్థలు ఉన్నాయి. వీటిలో పని చేసే ఉద్యోగులు, వర్కర్లు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరికి సరిపడా నివాస ప్రాంతాలు లేకపోవడంతో బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి తమ ఇష్టాను సారంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. నిజానికి ఒక నిర్మాణం చేపట్టాలంటే కొన్ని నియమ నిబంధనలున్నాయి. కానీ అక్రమ నిర్మాణాదారులు అవేమి పట్టించుకోరు. అద్దెలకు ఆశ పడి స్థల విస్తీర్ణంతో సంబందo లేకుండా ఇష్టాను సారంగా స్థాయికి మించి అంతస్థుల మిద అంతస్థులు కడుతున్నారు. వీటికి అనుమతులు తీసుకోవాలి అంటే జి ప్లస్ 2,3 అయితే కిందిస్తాయి అధికారులే ఇస్తారు. ఇంకా ఎక్కువ స్థల విస్తీర్ణం ఉండి జి ప్లస్ 4,5 ఆ పైన నిర్మించాలంటే జోనల్ స్థాయి, హెచ్.ఎం.డి.ఎ అధికారులు ఇవ్వాలి. కానీ ఫై స్థాయి అధికారుల వద్దకు వెళ్లాలంటే అనుమతులకు డబ్బులు చెల్లించాలి, నియమనిబంధనలు పాటించాలి, గ్రేటర్ పరిధిలో ఆది సాధ్యం కాదు. కాబట్టి జి ప్లస్ 2 లేదా 3 అంతస్తులకు అనుమతులు తీసుకొని అధికారులకు ముడుపులు ముట్టజేప్పి, లేదంటే రాజకీయ నాయకుల చేత ఒత్తిడి తెప్పించి తమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు.
అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు…
నివాస గృహాలు అవసరమే కానీ వాటికీ కొన్ని పరిమిత్తులుంటాయి. కానీ అక్రమార్కులకు అవేమి పట్టవు, అధికారులకు ముడుపులు ముట్టజేప్పి ఇష్టాను సారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుపాద కాలనీలో శివకృష్ణ అనే వ్యక్తి తన ఇష్టాను సారంగా అనుమతులకు విరుద్ధంగా మితిమించి, ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నాడు. ఇకనైనా ఇలాంటి అక్రమార్కులకు అడ్డుకట్టు వేయవలసిన అవసరం ఎంతయిన ఉందని జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు వాపోతున్నారు.
ఆధారాలతో నిరూపిస్తాం…
శేరిలింగపల్లి సర్కిల్ 20, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో చెలరేగుతున్న అక్రమ నిర్మాణదారులు..
ప్రేక్షక పాత్రలో టౌన్ ప్లానింగ్ అధికారులు..
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు..
యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు.. టి పి ఓ, చైన్ మెన్ల లీలలపై ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రిక లో మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.