
కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;
భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఉరికంబo ఎక్కిన గొప్ప ధీరోదాత్తుడు భగత్ సింగ్ అని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కొనియాడారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని శనివారం రోజు బాలనగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ. నేటి యువత భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. పోరాడితే పోయేది లేదు అంటూ షాహిద్ భగత్ సింగ్ చూపిన బాటను యువత అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, జ్యోతి, లక్ష్మయ్య, నరసింహ యాదవ్, సుధాకర్, అరుణ్ ,కృష్ణారావు, అనిల్, అస్లాం, భరత్ , రమణ, నరేందర్, క్రిస్టోఫర్, టైగర్ యాదగిరి, అరుణ్, జమీర్ ,ఆయాజ్ ,తదితరులు పాల్గొన్నారు.