పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయ భారతి న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ కేశవనగర్, గౌలిదొడ్డి లో రూ.50 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం రోజు కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ. కాలనీ వాసులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సిసిరోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్కు సూచించారు. డివిజన్ పరిధిలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి, సీనియర్ నాయకులు భిక్షపతి, శేఖర్, బాలకృష్ణ, హనుమంతు, గణేష్, సుమన్ ప్రసాద్, శ్రీను, రాజు, గోవింద, నగేష్, ఆనంద్, సుధాకర్, బాలయ్య, యాదయ్య, ఎల్లమ్మ, పద్మ, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
