రైతుల ఫిర్యాదుతో కొల్లాపూర్ ఆర్డీవో సస్పెండ్
నాగర్ కర్నూలు జిల్లా విజయ భారతి న్యూస్ ; రైతుల ఫిర్యాదుతో ఆర్డిఓ ను సస్పెండ్ చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం రోజు కొల్లాపూర్ ఆర్డీవో పి. నాగరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం నాగర్ కర్నూల్ కొల్లాపూర్ ఆర్డీఓగా నాగరాజు బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి భూములకు సంబంధించిన పహాని నకల్, ఇతరత్రా పత్రాలు కావాలంటే సదరు రైతులకు సకాలంలో ఇవ్వకుండా వేధిస్తున్నట్టు రైతులు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికి ఒక రేటు చెప్పి ఇక్కడి ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎన్నో ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఇటీవల ఏసీబీ అధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ పి. నాగరాజును సస్పెండ్ చేశారు.
