అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ చెప్పింన కేరళ రాష్ట్ర ప్రభుత్వం. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి దర్శనంపై పలు ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. గరిష్టంగా రోజుకు 80 వేల మంది అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని ట్రావెన్ కోర్ ఆలయ అధికారులు తెలిపారు.
