శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;
తెలంగాణలో బీ.సీ. సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులుతో పాటు సగర/ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర తో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.
