Breaking News

చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటున్నాం – హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు చేపడుతున్నాం – హైడ్రా కమిషనర్ రంగనాథ్

విజయ భారతి న్యూస్ ; చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్
అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే చెరువులకు సంరక్షణ కల్పిస్తామని హైట్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకోసం చెరువులు అంటేనే కన్నాతల్లి లాంటిది అని అన్నారు. తాగు నీరు, సాగు నీరు అందించే చెరువులు ఇప్పుడు పట్టణాలలో పట్టణీకరణతో ప్రాభవాన్ని కోల్పోతున్నాయని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో కబ్జాకోరుల చేతుల్లో ఎన్నో చెరువులు కనుచూపు మెరలో కనిపించకుండా కనుమరుగై పోయాయని, మిగిలి ఉన్న చెరువులు కూడా మురికి కుంటలుగా మారుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయంలో ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. చెరువుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. మన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను సంరక్షించి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

అంతేకాకుండా బెంగళూరులో మురుగు తప్ప నీళ్లు లేకుండా ఉన్న చెరువులను ఎలా మంచి చెరువులుగా మార్చారో ఆనంద్ మల్లిగవాడ్ మెట్రో కమిషనర్ రంగనాథ్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బెంగళూరులో 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఆయన వివరించారు. అతి తక్కువ ఖర్చుతో బెంగళూరులో చెరువులకు పునరుజ్జీవం కల్పించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *