శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; సమగ్ర కుల గణన జరపాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర కుల గణన జరపాలని జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ కులగణన చేపట్టాలని చేసిన ఇన్నేళ్ల మా పోరాటాలకు ఫలితం దక్కింధని అన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగనన చేయడానికి జీవో విడుదల చేయడం శుభ పరిణామం అని అన్నారు. ఈ పోరాటంలో మేము భాగం కావడం చాలా సంతోషంగా ఉంధని సమగ్ర కుల గణన జరిగి అన్ని రంగాలలో
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు
దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని అన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంకేతం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని బీసీ కుల సంఘాలు నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
