పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి
కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ; పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సూచించారు. దసరా మరియు దీపావళి పండుగను పురస్కరించుకొని పార్టీ సీనియర్ నాయకులు మరియు డివిజన్ మరియు మహిళా అధ్యక్షురాలు బాలానగర్లోని పార్టీ కార్యాలయానికి తరలివచ్చి బండి రమేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని తగిన పదవులు కల్పిస్తుందని పేర్కొన్నారు.

