శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ;
డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని, డాక్టర్ కలాం లెగసీ హ్యాకథాన్ 2024 – వుమెన్ ఇన్ రోబోటిక్స్ పేరుతో ప్రతిష్టాత్మక హ్యాకథాన్‌ను ప్రారంభించామని,ఈ కార్యక్రమం డిసెంబర్ 13 నుండి 15 వరకు జరుగుతుందని ఐఈఈఈ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్. సుదర్శన్ జయబాలాన్ తెలిపారు…ఈ హ్యాకథాన్ మహిళల ప్రాధాన్యాన్ని పెంపొందించడం, రోబోటిక్స్, ఆటోమేషన్, మరియు STEM రంగాలలో మహిళలను స్ఫూర్తి పరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు..డాక్టర్ కలాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యంమని,ఈ హ్యాకథాన్ ద్వారా మహిళలు రోబోటిక్స్ రంగంలో ముందంజ వేయాలని ఆశిస్తున్నాము” అని అన్నారు.
టీ వర్క్స్ సీఈఓ జోగేంద్ర తనికెళ్ళ మాట్లాడుతూ, “మేము మా సదుపాయాలు, మిషనరీలు, మరియు ప్రోటోటైప్ శిక్షణ ద్వారా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, ఇన్నోవేషన్ కోసం నిరంతర సహకారం అందిస్తున్నాము” అని తెలిపారు….
అలీప్ వీ హబ్ చీప్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్. జారూల్లా మాట్లాడుతూ,మహిళలకు అవసరమైన సమస్యల పరిష్కార మార్గాలను అందించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధి కోసం ఉపకారం చేస్తోందన్నారు…అలీప్ ఆవిష్కరణలను ముందుకు తీసుకువచ్చే మహిళలకు ఇంక్యుబేషన్ మరియు వ్యాపార అభివృద్ధిలో పూర్తి సహాయాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు..
ఎంఎస్ఎంఈ డైరెక్టర్ డీఎఫ్ఓ ఎస్. విజయకుమార్ మాట్లాడుతూ, “మేము ఈ కార్యక్రమానికి అన్ని విధాలా మద్దతు అందిస్తాము. ఆవిష్కరణలు వ్యాపార వేదికలుగా మారేందుకు అవసరమైన ఎంట్రప్రెన్యూర్షిప్ వసతులను అందిస్తాం” అని తెలిపారు…
డిసెంబర్ 13 నుండి 15 వరకు జరగబోయే ఈ హ్యాకథాన్ అనేక కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది. సాంకేతికత, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ మహిళలకు భవిష్యత్తులో విజయవంతమైన కెరీర్ ను నిర్మించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు…

