విజయభారతి న్యూస్ ; బాచుపల్లి నారాయణ కాలేజ్ లో అనూష ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషనీ ఆదివారం రోజు మధ్యాహ్నం సమయంలో విద్యార్థినీ అనూషను హాస్టల్ లో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు. విద్యార్థిని అనూష
తల్లితండ్రులు సిటీ దాటేలోపే అనూష స్పృహ కోల్పోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం.
విద్యార్థిని అనూష తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళేసరికి ఊరి వేసుకొని చనిపోయిందని నారాయణ కాలేజీ యాజమాన్యం తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ కు చేరుకున్నలోపే
పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని కాలేజి సిబ్బంది బాచుపల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

