. విజయభారతి న్యూస్ ; వంట మనిషి అరాచకం పిండిలో మూత్రం కలిపి చపాతీల తయారీ చేస్తుంది.
అయితే, ఇన్నేళ్లుగా ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నితిన్ గుప్తా భార్య రూపమ్ గుప్తాకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ ఒకేలా కాలేయ సమస్యలతో బాధపడుతుండడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. వారి అనుమానం పనిమనిషిపై పడింది.
దీంతో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కిచెన్లో రహస్యంగా సీసీకెమెరా అమర్చారు. ఆ తర్వాత ఫుటేజీ పరిశీలించగా వారి కళ్లు బైర్లు కమ్మాయి. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రోటీలు తయారుచేసేందుకు పిండిలో మూత్రం కలపడం చూసి షాకయ్యారు.
దీంతో ఈ వీడియోను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఆరోపణలను నిందితురాలు రీనా ఖండించింది. వీడియో చూపించాక నేరాన్ని అంగీకరించింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది. చిన్నచిన్న విషయాలకు కూడా తనను తిడుతుండడంతో ప్రతీకారం తీర్చుకునేందుకే తానీపని చేసినట్టు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.
