Big breaking..
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా విద్యార్థులు.!
డిప్యూటేషన్ పై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను తిరిగి రప్పించాలని డిమాండ్.!
విజయ భారతి న్యూస్ ;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని చౌదర్ గూడ మండల కేంద్రంలో జిల్లా ఉన్నతస్థాయి పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్ పై వెళ్లిన తెలుగు, ఇంగ్లీషు, ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలకు రప్పించాలని వారి డిప్యూటేషన్ ను వెంటనే క్యాన్సల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆకాష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ముందు ఉన్న రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఉపాధ్యాయులు తమకు ఇష్టం వచ్చినట్టు డిప్యూటేషన్ పై వెల్లితే విద్యార్థులు తమ చదువును నష్టపోతున్నారని పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు..