కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమీర్ ఆధ్వర్యంలో గురువారం రోజు రాత్రి అల్లాపూర్ డివిజన్ సఫదర్ నగర్ లో నిర్వహించిన గ్యార్మీ షరీఫ్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మూడువేల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము వేణు, మొయిజుద్దీన్, విటల్ రెడ్డి, కనకయ్య, సయ్యద్ ఐజాజ్ , మస్తాన్ రెడ్డి, నజీర్, ఇర్ఫాన్, శివ చౌదరి, సంతోష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

