ఆత్మస్థైర్యానికి కరాటే చాలా ముఖ్యం శ్రీరాములు అందెల
విజయ భారతి న్యూస్ ; మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చిప్ప వెంకటేశం ఫంక్షన్ హాల్ లో 7వ సక్సెస్ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ. కరాటే ఆత్మస్థైర్యానికి, మనోధైర్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం శ్రీరాములు పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ను అందజేశారు. అలాగే క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులంతా మునుముందు దేశానికి ఉపయోగపడే విధంగా తమ ప్రతిభను చాటి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ బిజెపి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, నిర్వాహకులు చంద్రశేఖర్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


