శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుల పట్టణ సమాఖ్య సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ ని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం లో దివ్యాంగుల భవనం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ. దివ్యాంగులు ఎందులో తక్కువ కాదని, అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని దివ్యాంగుల భవనం ఏర్పాటు విషయంలో ప్రభుత్వ అధికారులతో మాట్లాడి భవనం ఏర్పాటు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో దివ్యాంగుల సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్, విజయ్ కుమార్, వెంకటేష్, సాగర్, ఫకీర్, లక్ష్మి, రాజేశ్వరి, ఊర్మిళ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

