విజయ భారతి న్యూస్ ; కోల్ కత్తా కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, మోడల్ సన్నతి మిత్రా ఇటీవల దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఒంటికి తెల్లటి కండువా చుట్టుకుని బాలీవుడ్ పాటకు రీల్స్ చేసింది. దీంతో ఆమె తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నతిని అరెస్టు చేయాలని పలువురు పేర్కొన్నారు. స్మారక చిహ్నం వద్ద ఇలా చేయడం సరికాదని ఒకరు కామెంట్ చేశారు. సన్నతి 2017లో మిస్ కోల్కతాగా నిలిచారు.
