కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ; కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్లో 5 ఏళ్ల బాలుడిని పండ్లు అమ్ముకునే ఓ యువకుడు బాత్రూంలోకి తీసుకెళ్లి నోరుమూసి లైంగిక దాడికి యత్నించాడు. బాలుడు భయపడి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై యువకుడికి దేహశుద్ధి చేశారు. సదరు బాలుడు కోల్ కత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన కార్మికుడి కుమారుడని, నిందితుడు వారం రోజులుగా పండ్లు ఇస్తూ ఆ బాలుడిని మచ్చిక చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
