శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; చందానగర్ డివిజన్ పరిధిలో గల గంగారాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ శనివారం రోజు యూనిఫామ్ లతో పాటు బెల్టులను అందించారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ. విద్యార్థులు క్రమశిక్షణ తో విద్యను అభ్యసించాలని తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమ లో పాఠశాల ఉపాద్యాయులు సుభాష్, విజయలక్ష్మి, ప్రీతి, కృష్ణ వేణి, సంజీవ్ కుమార్, భీమన్న, నరహరి, వాణి, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

