విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని శ్రీచైతన్య యాజమాన్యం
విద్యార్థి సంఘాల ఆందోళన
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలలో విద్యార్థులపై వేధింపులు ఆత్మహత్యలు రోటీన్ గా మారాయి. మియాపూర్ కల్వరి టెంపుల్ క్యాంపస్ లో జరిగిన ఘటన మరువకముందే. తాజాగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో గల మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల లెక్చరర్ సభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు వివిధ విద్యార్థి సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న హరీష్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెని వేధిస్తున్నట్లు మెసేజ్ చేస్తున్నారని తెలిపారు. మెసేజ్ లలో ఎక్కడ కలుద్దాం, ఎప్పుడు కలుద్దాం, మీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని సంభాషణతో మెసేజ్ చేసేవాడని తెలిపారు. ఈ విషయాలు బయటికి తెలిస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయం పై తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కాలేజీ ఎదుట విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజీకి దెగ్గరకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకుని విద్యార్థిని పట్ల అస్యబంగా ప్రవర్తించిన లెక్చరర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

