వికారాబాద్ విజయభారతి న్యూస్ ;
రైతులకు వ్యవసాయంలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని,రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వికారాబాద్ మండల నూతన వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి తెలిపారు.సోమవారం వికారాబాద్ మండల వ్యవసాయాధికారి గా ప్రసన్న లక్ష్మి మండల వ్యవసాయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.వికారాబాద్ లో విధులు నిర్వహించే జ్యోతిని నవాబ్ పెట్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మండల నూతన వ్యవసాయాధికారి ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ. మండల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చెరవేస్తామని,అందులో సందేహాలు ఉన్న నివృత్తి చేస్తామన్నారు.రైతులను మోసం చేసే దళారులను సహించేది లేదన్నారు.రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతులకు మేలు చేస్తామని తెలిపారు.
