జమ్మూ కాశ్మీర్ లోని 30 మంది జవాన్ల ప్రాణాలు కాపాడి అమరుడైన సైనికుడు సుబ్బయ్యజమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న ఆర్మీ జవాన్ అనుకోకుండా ల్యాండ్‌మైన్ మీద పొరబాటున కాలు వేయడంతో తన ప్రాణం పోయినా సరే అతని తోటి ఉన్న మరో 30 జవాన్లను కాపాడాలనే ఉద్దేశంతో వారందరినీ దూరంగా పంపించాడు. ఆపై ల్యాండ్‌మైన్ పేలి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన సుబ్బయ్య 25 వ రాష్ట్రీయ రైఫిల్స్ లో సేవలందిస్తున్నారు. ఆయన పార్థివ దేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయని అన్నారు.
