శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; తెలంగాణ ఓలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్షిగా తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ (telangana hockey president) చందానగర్ కు చెందిన కొండ విజయ్ కుమార్ విజయం సాదించారు. బుధవారం రోజు యల్ బి స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ ఆసోసియేషన్ ఏన్నికల ఫలితాల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి ప్యానల్ లో భాగంగా సంయుక్త కార్యదర్శిగా విజయం సాదించిన కొండ విజయ్ ను పలువురు అసోసియేషన్ సభ్యులతో పాటు పలు క్రీడ సంఘాల అద్యక్ష, ప్రధాన కార్యదర్శి లు అభినందించారు. ఏన్నికల ఫలితాల అనంతరం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా విజయం పత్రాన్ని కొండ విజయ్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా కొండ విజయ్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ది కోసం పాటుపడతానని తెలిపారు. వచ్చే ఓలింపిక్ క్రీడల్లో తెలంగాణ నుండి పాల్గొనే క్రీడాకారులు మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తామని తెలంగాణ ఓలింపిక్ అసోయేషన్ నూతన సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ తెలిపారు.

