నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కొండూర్ చౌరస్తా వద్ద
ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్ రిమాండుకు తరలింపు
నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిది లో తేది 26.12.2024 గురువారం నాడు సాయంత్రం 4 గంటల సమయంలో విశ్వాసనీయ సమాచారం మేరకు ఎస్సై మరియు సిబ్బంది కొండూర్ గిర్ని చౌరస్తా లో వాహనాలు తానికి చేస్తుండగా భీంగల్ మండలం బడా భీంగల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు 1. ఒరగంటి శ్రీనివాస్ S/o జనార్ధన్, వ,,21 సం,2. చిత్తరి తరుణ్ S/o రాజేశ్వర్, వ,, 21 3.మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారిని ఆపి సోద చేయగా వారిదగ్గర మూడు పాకెట్లు 60 గ్రాముల గాంజ దొరకడంతో అదుపులోకి తీసుకొని వారిని విచారించగా మెండోరా గ్రామానికి చెందిన కనక యశ్వంత్ S/o నర్సయ్య బోదాసు నరేష్ S/o నర్సయ్య దగ్గర కొనుగోలు చేసినట్లు చెప్పడంతో వారిని పెద్ద వాల్గోట్ గ్రామంలో పట్టుకోవడంతో వారి దగ్గర 250 గ్రాముల గంజా స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను రిమాండ్ కు తరించినట్లు డిచ్పల్లి సిఐ మల్లేష్, సిరికొండ ఎస్సై రామ్ వెల్లడించారు.
