Breaking News

వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య?

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ;
రాచకొండ పోలీసు కమీషనరేట్, మేడిపల్లి పోలీసు స్టేషను పరిధిలో శనివారం రోజు ఉదయం జనగామ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేడిపల్లి పీఎస్ పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ లోని అనురాగ్ రెడ్డి వర్కింగ్ బాయ్స్ హాస్టల్ లో బండ్లగుడెం గ్రామం, లింగాల గణపురం మండలం, జనగామ జిల్లా కు చెందిన అనిరెడ్డి మహేందర్ రెడ్డి(36) అనే క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు అయితే ఈ హత్య హాస్టల్ లో శుక్రవారం రాత్రి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వంటిపై ఉన్న గాయాలను బట్టి చూస్తే హాస్టల్ లో వంటకు ఉపయోగించే గంటెలు, ఇతర సామగ్రితో బలంగా కొట్టడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మహేందర్ రెడ్డి ప్రయివేటు క్యాబ్ డ్రైవర్, అప్పుడప్పుడు తాత్కాలిక డ్రైవరగా కుడా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఇదే హాస్టల్ లో ఉండేవాడని అప్పుడే హాస్టల్ లో ఒక మహిళతో పరిచయమై అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనంతరం అతడు ఈ హాస్టల్ లో ఉండకుండా వేరే చోటా ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోయే వాడు అ క్రమంలోనే శుక్రవారం నాడు రాత్రి మద్యం సేవించిన అతను హాస్టల్ కు వెళ్ళడంతో గొడవ జరిగి ఈ హత్యకు దారి తీసినట్లు అతని స్నేహితులు చెప్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *