హైదరాబాద్ తెలంగాణ విజయభారతి న్యూస్ ; కురుమలువిద్యారంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశం కురుమ అన్నారు. హైదరాబాద్ ఆఫ్జల్ గంజ్ లోని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం భవనంలో రాష్ట్ర కురుమ సంఘం, కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ గీతా గోటి నేతృత్వంలో SSC నుండి పీజీ, మెడికల్ వరకు… వివిధ విభాగాల్లో, అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన, మెరిట్ విద్యార్థులకు, మెరిట్ అవార్డు, నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్గ మల్లేశం మాట్లాడుతూ… విద్యార్థులు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, తాము కన్న కలలు సహకారం చేసే దిశగా ముందుకు సాగాలన్నారు. వివిధ విభాగాల్లో, మెరిట్ ని సాధించిన విద్యార్థులను, ప్రోత్సహించేందుకుగాను, ఈ అవార్డుల ప్రధానం చేయడం జరిగిందని అన్నారు. మన్సూరాబాద్ లో పాఠశాల కొనసాగుతుందని, త్వరలో కోకాపేట్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసుకొని, పేద గురుమ విద్యార్థులకు సీట్లను కేటాయించే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు.


