Breaking News

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు – గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు!

సంగారెడ్డి విజయభారతి న్యూస్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన అన్ని పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు. తీన్మార్ మల్లన్న టీమ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ. ఈరోజు తీన్మార్ మల్లన్న పుట్టిన రోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి దాదాపు 100 అక్రమ కేసులు పెట్టినా క్యూ న్యూస్ వేదిక పైన గత పాలకుల అరాచకలను బయట పెట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్, ప్రభు, అబ్దుల్, ఆనేగుంట శ్రీకాంత్,నరేష్,ఆసుపత్రి సిబ్బంది బాలస్వామి,ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *