Breaking News

ఓయో రూమ్ అడ్డాగా మార్చుకొని గంజాయి సరఫరా

నిందితుల దగ్గర నుండి 3.625 గ్రాముల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

శేరిలింగంపల్లి కొండాపూర్ విజయభారతి న్యూస్ ; ఓయో రూమ్‌ అడ్డాగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు 25, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజన 18 స్నేహితులు. కాగా వీరు ఇద్దరు వేరువేరుగా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తుండేవారు. ఈ నేపథ్యంలో సంజన, రాజులు ఇద్దరూ కలిసి గంజాయి విక్రయించేందుకు పథకం పన్నారు. అందులో భాగంగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో గల
ఓయో రూమ్ బుక్ చేసుకుని గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తూన్నారు.ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న గచ్చిబౌలి ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం రోజు రాత్రి కొండాపూర్ లోని ఓయో రూమ్ పై దాడి చేసి రాజు, సంజనలను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. విశాఖపట్నం జిల్లా అరుకు వివిధ ప్రాంతాల నుండి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్ లో ఉంటూ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 3.625 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *