బడి బయట పిల్లలు
48 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగింత
కామారెడ్డి బ్యూరో, ఫిబ్రవరి 2 (విజయభారతి);
కామారెడ్డి జిల్లాలో, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, లేబర్ సంబంధిత శాఖ అధికారులు కామారెడ్డి జిల్లాలో బడి బయట పిల్లలు, బాల కార్మికులను గుర్తించి 48 మంది వారి వారి సంబంధికులకు అప్పగించారు. మిగతా అరుగురిని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, చిల్డ్రన్ హోమ్ లో చేర్పించారు.
ముగ్గురు – అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ చేర్పించారు.
ముగ్గురు – చిల్డ్రన్ హోమ్ కు అప్పగింత మొత్తం 54 మంది చిన్నారులను సంబంధిత శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 54 మందిని గుర్తించి, ఆరుగురుపై కేసు నమోదు చేశారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే శిక్షార్హులు అవుతారని జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నారని సమాచారాన్ని సంబంధించిన శాఖలకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచబడతాయని సూచించారు. నేటి పౌరులు, రేపటి పౌరులు గా ఎదుగుతారు అన్నారు. చిన్నారుల జీవితాలను చిన్న బిన్నం చేయకూడదని అలా చేసిన వారిపై కఠిన చర్యలతో పాటు శిక్ష జైలు శిక్ష, జరిమానా లేబరేట్ యాక్ట్ కేసులు నమోదు అవుతాయనిచ్చరించారు.
