త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ అనిత రావు ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ ఎక్స్పో
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న త్రివేణి టాలెంట్ స్కూల్ విద్య సంస్థ లో శనివారం రోజు జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో త్రివేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపల్ అనితా రావు, డైరెక్టర్ వీరేంద్ర చౌదరి పాల్గొని మాట్లాడుతూ. శేరిలింగంపల్లి, త్రివేణి టాలెంట్ స్కూల్ ఫ్రీ ప్రైమరీ నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు విద్యా వైజ్ఞానిక ప్రయోజన కార్యమాలకు ప్రాజెక్టు వర్క్ తయారు చేసి వైజ్ఞానిక ప్రదర్శలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నాలుగు వందలకు పైగా సైన్స్ ఎక్స్పో ప్రాజెక్టులకు వర్క్ చేసినవి సందర్శనలో ఉంచారు. త్రివేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు చక్కగా తమ మేధాశక్తి నీ ప్రదర్శించడం జరిగినదని అన్నారు. ఉసాధ్యాముల సహకారంతొ చేసిన వైజ్ఞానిక ప్రతిరూపాలు, యోజన పరికరాలు వివరిస్తు ఎలా ఉపయొగ పడతాయో తెలియజేశారు. విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించడమే తమ యొక్క ఉపాధ్యాయుల లక్ష్యం అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులku కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
త్రివేణి స్కూల్ డైరెక్టర్ డి ఆర్ వీరేంద్రి చౌదరి, సెంట్రల్ అకడమిక్ కోఆర్డినేటర్ నటరాజ్,
సెంట్రల్ సైన్స్ ఆఫీసర్ సుబ్బారావు, సెంట్రల్ ప్రైమ్ ఇంచార్జ్ అర్చనా, సి ఆర్ ఓ సాయి, నర్శింహ రావు, ఏసీ ఆర్వో నరేష్, ఉపాధ్యాయురాలు సుప్రీయా, జ్యోతి , విశ్వనాథ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

