Breaking News

ఠాగూర్ సినిమాను మళ్ళీ చూపించిన మదినాగుడా సిద్ధార్థ్ హాస్పిటల్

నాలుగు రోజుల క్రితం చనిపోయిన శవానికి వైద్యం అందించిన డాక్టర్లు

శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదినాగుడా సిద్ధార్థ న్యూరో ఆస్పత్రిలో మరోసారి ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ ను డాక్టర్లు రిపీట్ చేశారు. న్యూరో సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగి చనిపోయి నాలుగు రోజులు దాటిన కూడా చికిత్సచేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి చివరికు శవాన్ని అప్పగించారు. మృతురాలి బంధువులు మదీనాగుడా సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నందునూరు గ్రామానికి చెందిన జి. సుహాసిని (23) గత ఏడాది డిగ్రీ పూర్తిచేసుకుని ఇంటి దగ్గరే ఉండేధని. అయితే జనవరి నెల 10వ తేదీన ఆమె కళ్లు తిరిగి పడిపోయింధని వారి బంధువులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లగా. అక్కడ సరైన వైద్యం అందడం లేదని, పరిస్థితి బాగులేదని కుటుంబ సభ్యులు అక్కడి డాక్టర్ ను సంప్రదించగా పేషెంట్ ని వెంటనే చెన్నైకి గాని హైదరాబాద్ కి గాని వెంటనే తీసుకువెళ్లి చికిత్స అందేలా చూడాలని సూచించారు. దీంతో సుహాసిని బంధువులు హుటా హుటిన హైదరాబాద్ నగరంలోని మధినాగుడా సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించారు. అప్పటి నుండి సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటి వరకు ఆమెకు వైద్యానికి అయిన రూ.13 లక్షలను రూపాయలను సుహాసిని బాధితులు ఆస్పత్రికి చెల్లించారు.
మరో రూ.5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది. శుక్రవారం రోజు అర్ధరాత్రి ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పేషంట్ సీరియస్ గా ఉందని డబ్బులు కట్టి వెంటనే ఇక్కడి నుండి వేరే ఏ హాస్పటల్ కు అయినా తీసుకువెళ్లండి లేకపోతే మే మే మాస్క్ తీసేస్తామని బంధువులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు యువతిని అంబులెన్స్ లో పంజాగుట్ట లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రి అటెండర్ మధ్యలోనే వదిలేసి అంబులెన్స్ నుండి దిగి వెళ్లాడని, అక్కడ మరో వ్యక్తి తమతో పాటు నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు చూపించగా పేషెంట్ చనిపోయిందని మీరు ఏ హాస్పిటల్ నుండి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళండి అని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు మృతదేహాన్ని తిరిగి మదీనాగుడా సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రికి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తోచేదేమి లేక మృతురాలి కుటుంబ సభ్యులు మీడియాను ఆశ్రయించగా ఇదే విషయం పై సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ వెంకటేష్ ను వివరణ కోరగా లీగల్ నోటీసు తీసుకుని వస్తే మాట్లాడుతా లేదంటే మాట్లాడను అంటూ మీడియా పై చిందులు వేశారు. నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చారు. రావడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. మీకేంపని అంటూ దురుసుగా వ్యవహరించారు. సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి సిబ్బంది సైతం మీడియా విలేకరుల పైకి, తమ బంధువుల పైకి దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయిన మా చెల్లికి వారం రోజులుగా వైద్యం చేశారుమృతురాలి అన్న రాకేష్

గత జనవరి నెల 11న మా చెల్లి కళ్లు తిరిగి పడిపోతే కడప నుండి హైదరాబాద్ సిద్ధార్థ న్యూరో హాస్పటల్ కి తీసుకువచ్చామని. అప్పటి నుండి ఇక్కడే వైద్యం చేపిస్తున్నామని ఇప్పటి వరకు రూ.13 లక్షలు చెల్లించామని మేము వెళ్లి డాక్టర్లను పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే ప్రతీరోజు కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు చనిపోయిందని శవాన్ని అప్పగించారంటు కన్నీరు పెట్టుకున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయినా మాకు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

నాకు సీఎం తెలుసు.. అవసరం అయితే రౌడీలను దింపుతా.. డాక్టర్ సిద్దార్థ్

బాధితుల ఆందోళన పై సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి ఎండీ డాక్టర్ సిద్దార్థ్ ను మీడియా సంప్రదించగా ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. ఏం రాస్తారో రాసుకోండి. నాకు సీఎం తెలుసు ఆయనకు ట్విట్టర్ ద్వారా టీట్ చేశాను అంటూ నేను ఫోన్ కొడితే రాయలసీమ నుండి వందల మంది రౌడీలు దిగుతారు. నా సంగతి మీకు తెలియదు అంటూ మీడియాను సైతం డాక్టర్ సిద్దార్థ్ భయభ్రాంతులకు గురి చేశాడు.

oplus_131072

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *