Breaking News

రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ .. హెల్త్ మినిస్టర్ సీరియస్..!!

హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు.

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.

మినిస్టర్ ఆదేశాలో ఫిబ్రవరి 10న ఆరోగ్యశాఖ అధికారులు మియాపూర్ లోని సిద్దార్థ్ హాస్పిటల్ కు వచ్చారు. హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. అయితే సిద్దార్థ్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; కడప జిల్లాకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్దార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బులుకట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు. నిమ్స్ కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *