ఏసీబీకి పట్టుబడ్డ గచ్చిబౌలి ఏడిఈ సతీష్ కుమార్
శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; గచ్చిబౌలి విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 75 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఏ డి ఈ సతీష్ కుమార్. ట్రాన్స్ ఫార్మర్ మంజూరు కోసం ఏడిఈ సతీష్ కుమార్ 75 వేల రూపాయలు డిమాండ్ చేయగా వినియోగదారుల నుండి ముందే 25 వేల రూపాయలు తీసుకున్నారు. శుక్రవారం రోజు మరో 50 వేల రూపాయలు తీసుకుంటున్న ఏడిఈ సతీష్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
