Breaking News

నిమ్మల దాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో 32 నిఘా నేత్రాల ఏర్పాటు.

నిఘా నేత్రాలను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరికేపూడి గాంధీ

శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్ ;
హఫీజ్ పేట్ గ్రామ యువ నాయకుడు నిమ్మల దాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జనప్రియనగర్ కాలనీ ఫేజ్ 1 మరియు 2 అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు తన స్వంత నిధులు వెచ్చించి కాలనీలో దాదాపు 32 నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. నిఘా నేత్రాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మియాపూర్ ఎస్ఐ పాల్గొని ప్రారంభించారు. పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.
డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు కానీ వాటిని ప్రజల ఉపయోగాల కోసం ఖర్చుపెట్టే మంచి మనసున్న వ్యక్తి నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ అని అన్నారు. కాలని అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతో అభినందనీయమని ఇంతకుముందు కూడా తన సొంత డబ్బులతో కాలనీలలో నీటి ఇబ్బంది కలగకుండా ఎన్నో బోర్లు వేశారని ప్రజల సౌకర్యార్థం కమిటీ హాల్ నిర్మించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కొనియాడారు.
ఇంత చిన్న వయసులోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాత్రినాథ్ గౌడ్ ను అందరు ఆదర్శంగా తీసుకుని కాలనీలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే అని అన్నారు. ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో ఉన్నత స్థితికి రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ ఎస్సై, జనప్రియనగర్ ఫేస్ 1 కాలనీ అధ్యక్షుడు జయసూర్య, మల్లికార్జున్, సుధాకర్ దాస్, ఫేస్ 2 కాలనీ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, జనరల్ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *